News May 26, 2024

నల్గొండ: REWIND.. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచాడు..!

image

2021లో KMM-NLG-WGL పట్టభద్రుల MLC ఎన్నికలో రెండో ప్రాధాన్య ఓట్లతోనే అప్పటి BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తం 5,05,565 ఓట్లకు గానూ 3,87,960 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 21,636ఓట్లు చెల్లలేదు. ఫలితంగా రెండో ప్రాధాన్యతా ఓట్లను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 రోజులపాటు జరిగిన లెక్కింపు అనంతరం అధికారులు విజేతను ప్రకటించారు. రేపు ఈస్థానంలో ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.

Similar News

News November 19, 2025

ముగిసిన కోట మైసమ్మ ఆలయ జాతర

image

నిడమనూరు మండల పరిధిలోని కోట మైసమ్మ ఆలయ జాతర మంగళవారం ముగిసింది. మూడో రోజు సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించారు. అంతకముందు భక్తులు బోనాలు సమర్పించారు. జిల్లా నుంచే కాకుండా మహబూబ్‌నగర్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చినట్లు ఈవో సిరికొండ నవీన్ కుమార్ తెలిపారు.

News November 19, 2025

జాతీయ జల అవార్డు అందుకున్న నల్గొండ జిల్లా

image

జల్ సంజయ్ & జన్ భగీదరి కార్యక్రమంలో దేశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా నల్గొండ ద్వితీయ స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్‌డీఏ పీడీ శేఖర్ రెడ్డి 6వ జాతీయ జల అవార్డు (రూ.2 కోట్ల ప్రైజ్ మనీ, ప్రశంసా పత్రం)ను అందుకున్నారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.

News November 19, 2025

నల్గొండ: బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

2025 -26 విద్యా సంవత్సరానికి గాను ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల నమోదు కోసం జిల్లాలోని GHS, ZPHS, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో 9 10వ తరగతి చదువుతున్న అర్హులైన BC, EBC విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజకుమార్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు DEC 15 లోపు https://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.