News April 6, 2025
నల్లగొండ: కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా అరెస్టు

అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆదివారం నల్లగొండలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్ట్ వివరాలను మీడియాకు వివరించారు. ఐదుగురు నిందితులు అరెస్ట్ చేసి వారి నుంచి దాదాపు రూ.25 లక్షల విలువైన 600 లీటర్ల స్పిరిట్తో పాటు అక్రమంగా తయారు చేసిన 660 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News December 10, 2025
పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ భద్రత: ఎస్పీ శరత్ చంద్ర పవార్

జిల్లా పరిధిలోని మూడు దశల్లో 869 గ్రామపంచాయతీలో జరిగే ఎన్నికలకు 1,680 పోలీస్ సిబ్బందితో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే 100కి సమాచారం అందించాలని కోరారు.
News December 9, 2025
గ్రామ పోరుకు సిద్ధం.. ‘నల్గొండలో ఏర్పాట్లు పూర్తి’

జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ విషయాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని దృష్టికి తీసుకెళ్లారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ వివరాలను నిర్ణీత సమయాల్లో ‘టీ-పోల్’లో నమోదు చేయాలని ఈసీ ఆదేశించారు.
News December 9, 2025
ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: నల్గొండ కలెక్టర్

నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను మంగళవారం ఆదేశించారు. కనగల్ ఎంపీడీవో ఆఫీస్, సాయిరాం ఫంక్షన్ హాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ పేపర్లు, బాక్సులను పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాల వారీగా సామాగ్రి సిద్ధం చేయాలని, బ్యాలెట్ పత్రాలు, బాక్సులు ప్రాపర్గా చెక్ చేయాలని సూచించారు.


