News September 12, 2024
నల్లగొండ: గణేష్ నిమజ్జన శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు

గణేష్ నిమజ్జన శోభాయాత్ర కోసం ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నల్లగొండ డిఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. 9 అడుగుల వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం వల్లభారాపు చెరువు, 9 అడుగుల కంటే ఎక్కువ ఉన్న విగ్రహాల కోసం 14వ మైలురాయి వద్ద నిమజ్జనం ఏర్పాట్లు చేసామని తెలిపారు.
Similar News
News October 27, 2025
NLG: కల్లాల్లోనే ధాన్యం.. త్వరగా కొనరే..!

నల్గొండ జిల్లాలో రైతన్నలను కష్టాలు వెంటాడుతున్నాయి. 186 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు మాత్రం వేగంగా జరగడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను ప్రభావం ఉంటుందని వార్తలు వస్తున్నాయని కల్లాల్లోనే ధాన్యం ఉంటే తీవ్రంగా నష్టపోతామంటున్నారు. కాగా జిల్లాలో ఇంకా 150 కేంద్రాలు తెరుచుకోవాల్సి ఉంది. కొన్ని కేంద్రాల్లో కల్లాలలోని ధాన్యం తడవడంతో పాటు వరదకు కొట్టుకుపోయింది.
News October 27, 2025
నేతలకు సవాల్గా నల్గొండ డీసీసీ

నల్గొండ DCC ఎంపిక మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలతో పాటు సీనియర్ నేత జానారెడ్డికి సవాల్గా మారింది. బీసీ వైపు మొగ్గుచూపితే చనగాని దయాకర్, పున్న కైలాష్ నేత, చామల శ్రీనివాస్, రాజా రమేష్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ అయితే కొండేటి మల్లయ్యకు ఇచ్చే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఓసీ అయితే గుమ్ముల మోహన్ రెడ్డికి డీసీసీ పీఠం దక్కే అవకాశముంది. ఎవరికి వారు అగ్ర నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
News October 27, 2025
ALERT.. నల్గొండ జిల్లాపై ‘మొంథా’ ప్రభావం

రానున్న 2,3 రోజులు ‘మొంథా’ తుఫాన్ ప్రభావం నల్గొండ జిల్లాలో తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఆదివారం ఆమె ఈ విషయమై సంబంధిత జిల్లా అధికారులు, ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విషయంపై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు ఆదేశించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తడిసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దన్నారు.


