News October 1, 2024
నల్లగొండ: బతుకమ్మ, దసరా సందర్భంగా 639 అదనపు బస్సులు

బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని నల్లగొండ రీజియన్ లోని 7 డిపోల నుండి సుమారు 639 బస్సులను అదనంగా నడుపుతున్నామని ఆర్ఎం M. రాజశేఖర్ సోమవారం తెలిపారు. అక్టోబర్ 1 నుండి 11 వరకు, తిరుగు ప్రయాణం కోసం 13 నుండి 17 వరకు బస్సులు నడుపుతామని తెలిపారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా సురక్షితమైన, సౌకర్యవంతమైన, శుభప్రదమైన ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని కోరారు.
Similar News
News November 14, 2025
NLG: చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు

జిల్లాలో చేప పిల్లల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు, కుంటలకు పూర్తిగా నాసిరకం సీడ్ వస్తున్నదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనుండగా.. ఇప్పటివరకు 60 లక్షలకు పైగానే చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లాలోని ముత్యాలమ్మ చెరువు, కోతకుంట, ఉంగూరుకుంట చెరువులకు పంపిణీ చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్యకారులు ఆరోపించారు.
News November 14, 2025
NLG: 17 నుంచి పత్తి కొనుగోలు బంద్

సీసీఐ తీరుపై మరోసారి కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులతోపాటు కాటన్ మిల్లులను ఇబ్బందులకు గురిచేసేలా పత్తి కొనుగోళ్లల్లో కఠిన నిబంధనలను సడలించాలన్న విజ్ఞప్తిని సీసీఐ పట్టించుకోకపోవడంతో మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈనెల 17వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
News November 14, 2025
NLG: యాసంగి ప్రణాళిక@6,57,229 ఎకరాలు

యాసంగి సాగు ప్రణాళికను NLG జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. గత యాసంగి సీజన్ లో వరి, ఇతర పంటలు కలిపి 6,49,712 ఎకరాల్లో రైతులు సాగు చేయగా.. ప్రస్తుత యాసంగి సీజన్లో 6,57,229 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలను రూపొందించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు.


