News November 17, 2024
నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. సస్పెండ్

నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ చేసినందు వల్ల ముగ్గురు వైద్య విద్యార్థునులు, ఒక జూనియర్ డాక్టర్ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. 2వ సంవత్సరం విద్యార్థి ఒక నెల, ఇద్దరు 4వ సంవత్సరం విద్యార్థులను ఆరు నెలలు, ఒక జూనియర్ డాక్టర్ను మూడు నెలలు కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థినుల పట్ల ర్యాగింగ్ జరుగుతున్నప్పటికీ గుర్తించడంలో విఫలమైనట్లు సమాచారం.
Similar News
News December 19, 2025
NLG: 306 స్థానాల్లో గెలిచిన బీసీలు!

జిల్లాలో మొత్తం 869 గ్రామపంచాయతీలు ఉండగా.. వీటిలో మూడు పంచాయతీలు మినహా మిగతా 866జిపిలకు ఎన్నికలు నిర్వహించారు. బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లతో పాటు, జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసి 306 స్థానాల్లో బీసీలు విజయం సాధించారు. దీంతో జిల్లాలో 35.33 శాతం స్థానాలు బీసీలకే దక్కాయి.
News December 19, 2025
ముగిసిన ప్రత్యేక పాలన.. పల్లెలకు కొత్త సారధులు

నల్గొండ జిల్లాలో 22 నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడింది. ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఈనెల 22న నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలోని మొత్తం 869 గ్రామ పంచాయతీలకు గాను, మూడు మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతుండటంతో పల్లెల్లో సందడి నెలకొంది.
News December 19, 2025
కంప్యూటర్ కోర్సులో మహిళలకు ఉచిత శిక్షణ

దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రంలో కంప్యూటర్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఎ. అనిత తెలిపారు. 12వ తరగతి విద్యార్హత కలిగి, 18 నుంచి 35వ సంవత్సరాలలోపు వయస్సు గల వారికి నల్గొండ మహిళా ప్రాంగణంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.


