News August 20, 2024
నల్లగొండ: రికార్డు సృష్టించిన ఆర్టీసీ
రక్షా బంధన్ సందర్భంగా RTC నల్లగొండ రీజియన్లో 128 ఆక్యుపెన్సీ రేషియో, 76.26 ఎర్నింగ్ పర్ కిలోమీటర్తో 3,78,982 మంది ప్రయాణించారని ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ M. రాజశేఖర్ మంగళవారం తెలిపారు. ఇందులో మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారని, దీని ద్వారా రికార్డు స్థాయిలో రూ. 2,23,20,254 రాబడి వచ్చిందన్నారు. ఆ చరిత్రలో ఇది అల్ టైం రికార్డ్ అని, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించామన్నారు.
Similar News
News September 20, 2024
శ్రీశైలం జలాశయం సొరంగాన్ని సందర్శించిన మంత్రుల బృందం
శ్రీశైలం జలాశయం నుండి 40 కి.మీ భూగర్భ అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ దిగువన నిర్మించబడిన సొరంగాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి 30 టీఎంసీల నీటిని ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకొస్తుందని తెలిపారు.
News September 20, 2024
సూర్యాపేట: గణపతి లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు
సూర్యాపేట జిల్లా యాతవాకిళ్లలో ముస్లిం దంపతులు షేక్ దస్తగిరి – సైదాబీ మత సామరస్యం చాటుకున్నారు. శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలోని శ్రీ గణేశ్ మహారాజ్ లడ్డూని రూ.29,000 వేలకు కైవసం చేసుకున్నారు. భారీ ఊరిగేంపుతో లడ్డూను దస్తగిరి ఇంటికి తరలించారు. దస్తగిరి – సైదాబీ దంపతులను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
News September 19, 2024
దేవరకొండ: ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యం
నల్గొండ జిల్లా దేవరకొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైనట్లు సీఐ నరసింహులు తెలిపారు. పాఠశాల గోడ దూకి పారిపోయిన విద్యార్థులు బుధవారం అర్ధరాత్రి చింతపల్లి మండలం మాల్ పట్టణంలో పోలీసులకు దొరికినట్టు తెలిపారు. విద్యార్థులను దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.