News January 25, 2025
నల్లగొండ: రూ.500 కోట్లతో జిల్లా అభివృద్ధి: కోమటిరెడ్డి
నల్లగొండ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ఏడాది కాలంలో రూ.500 కోట్లు మంజూరు చేయించి తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు చేపట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. 11లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 11 నీటి ట్యాంకులను నిర్మిస్తున్నామని.. వచ్చే ఏప్రిల్ నుంచి ప్రతిఇంటికి ప్రతిరోజు కృష్ణా తాగునీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Similar News
News February 5, 2025
NLG: 33 జడ్పీటీసీలు.. 352కు చేరిన ఎంపీసీటీలు!
2016లో జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాలో 31 మండలాలు ఉండగా వాటి పరిధిలో 31 జడ్పీటీసీ, 349 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. ఆ తర్వాత జిల్లాలో రెండు మండలాలను పెంచారు. గట్టుప్పల్, గుడిపల్లి మండలాలు ఏర్పడడంతో మండలాల సంఖ్య 33కు పెరిగింది. దీంతో జడ్పీటీసీలు కూడా 33 కానున్నాయి. ఎంపీటీసీల పునర్విభజన చేపట్టడంతో మూడు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. దీంతో ఎంపీటీసీల సంఖ్య 352కు చేరింది.
News February 5, 2025
NLG: పరిషత్తు.. కసరత్తు
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. తాజాగా మండల జిల్లా పరిషత్ ఎన్నికలే మొదట నిర్వహిస్తామని చెబుతుండటంతో యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తుంది. జిల్లాలో 33 జడ్పీటీసీలు, 352 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న GP ఓటర్ల జాబితా ఆధారంగా ఎంపీటీసీ ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు.
News February 5, 2025
ఈనెల 7న బుద్ధవనంలో ‘త్రిపీటక పఠనోత్సవం’
నాగార్జునసాగర్ హిల్ కాలనీ బుద్ధవనంలో ఈనెల 7న మహాబోధి సొసైటీ సికింద్రాబాద్, అంతర్జాతీయ త్రిపీటక సంగాయన మండలి ఆధ్వర్యంలో త్రిపీటక పఠనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బౌద్ధ ధార్మిక సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణ కోసం నిర్వహించే కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన 200 మంది బౌద్ధ బిక్షువులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.