News January 26, 2025
నల్లగొండ: MGU మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జనవరి 30 నుంచి జరగాల్సిన పీజీ లా & ఎంసీఏ పరీక్షలను ఫిబ్రవరి 8 నుంచి నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన పోటీ పరీక్షల కారణంగా అకడమిక్ పరీక్షల కోసం సమాయత్తానికి కొంత సమయం కావాలంటూ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
Similar News
News November 25, 2025
సిరిసిల్ల: కలెక్టర్ హరిత సెలవుల పొడిగింపు

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ హరిత తన లాంగ్ లీవ్ను పొడిగించారు. అక్టోబరు 22న సెలవుపై వెళ్లిన ఆమె ఈనెల 24న విధులకు హాజరుకావాల్సి ఉంది. కానీ, ఆమె తన సెలవులను డిసెంబరు 12 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. ఇక సిరిసిల్లకు ఇన్ఛార్జ్ కలెక్టర్గా గరిమా అగర్వాల్ విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
.
News November 25, 2025
పెద్దపల్లి: ‘డిసెంబర్ 31లోపు దరఖాస్తులు సమర్పించాలి’

స్కాలర్షిప్ దరఖాస్తులు డిసెంబర్ 31లోపు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పెండింగ్ ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులపై సమీకృత జిల్లా కలెక్టరేట్లో హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్, హెచ్డబ్ల్యూఓలు, సంబంధిత అధికారులు ఉన్నారు.
News November 25, 2025
సర్పంచి రిజర్వేషన్లు.. జిల్లెల్లలో ఆశలు- నిరాశలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నవంబర్ 23న నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో తంగళ్లపల్లి మండలంలో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా జిల్లెల్ల గ్రామంలోని నాలుగు కూడళ్లలో, టీ స్టాళ్ల వద్ద పంచాయతీ ఎన్నికలపై చర్చలు మరింత జోరందుకున్నాయి. పీఠం ఎవరికి దక్కుతుందన్న ఊహాగానాలు వేగంగా మారుతుండగా, రిజర్వేషన్ కారణంగా కొందరు ఆశావహులు నిరాశకు గురవుతున్నారు.


