News January 10, 2025

నల్లజర్ల: ఆర్థిక ఇబ్బందులతో మహిళా వాలంటీరు ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో మహిళా వాలంటీరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉమ్మడి ప.గో. నల్లజర్ల(M)లో గురువారం జరిగింది. ప్రకాశరావుపాలెంకు చెందిన గౌతమి(24) ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.50 వేలు ఋణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది సామగ్రి బయపడేసి ఇంటికి తాళం వేస్తామని హెచ్చరించారు. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. తల్లిని చూసిన చిన్నారులు కన్నీటిపర్యంతమయ్యారు.

Similar News

News January 13, 2025

ప.గో: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

News January 12, 2025

భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

News January 12, 2025

దేవరపల్లి హైవే పై యాక్సిడెంట్.. స్పాట్‌డెడ్

image

దేవరపల్లి మండలం సూర్యనారాయణ పురం హైవే పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మృతుడు కందిపల్లి సత్యనారాయణ (26)గా గుర్తించారు. పండుగ నిమిత్తం హైదరాబాద్ నుంచి స్వగ్రామం బిక్కవోలుకు బైక్ పై వస్తున్నాడు. యర్లగూడెం టోల్‌గేట్ దాటిన తర్వాత బైక్‌ పై వెనుక కూర్చున్న సత్యనారాయణ నిద్ర మత్తులో కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.