News October 12, 2024

నల్లజర్ల: పెళ్లి పేరుతో మోసం.. యువకుడిపై కేసు నమోదు

image

నల్లజర్లలోని శ్రీనివాసరావు కాలనీలో ఉంటున్న సురేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం.. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేశాడు. కుల పెద్దల సమక్షంలో యువతి తల్లిదండ్రులు యువకుడిని నిలదీయడంతో తనకు సంబంధం లేదని ముఖం చాటేసాడు. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసామని సీఐ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు.

Similar News

News November 28, 2025

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

image

తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే ఆరవెల్లి రాధాకృష్ణతో కలిసి ఆమె ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతుల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న నూతన నిర్మాణాలను పరిశీలించి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ ఆమె వెంట ఉన్నారు.

News November 28, 2025

బాధితులకు రూ.1.85 కోట్లు అందజేత: కలెక్టర్

image

జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం జరిగిన విజిలెన్స్ కమిటీ సమావేశంలో డిసెంబర్ 24 నుంచి మే 25 వరకు బాధితులకు రూ.1.85 కోట్ల పరిహారం చెల్లించామని తెలిపారు. అట్రాసిటీ కేసులలో ఎఫ్ఐఆర్, చార్జిషీట్ నమోదులో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News November 28, 2025

భీమవరంలో మాక్ అసెంబ్లీ

image

మాక్ అసెంబ్లీ నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని హెచ్.ఎం. కె. కృష్ణకుమారి అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భీమవరంలోని ఝాన్సీలక్ష్మీబాయి మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థినులు గురువారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగం తయారు చేయడానికి ముందు, తర్వాత ప్రజల జీవన విధానం ఎలా ఉండేదో తెలిపే స్కిట్‌ను కూడా పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించారు.