News April 10, 2025

నల్లజర్ల: వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు

image

చిన్నారులను HIV ఉన్న ఓ వృద్ధుడు లైంగిక చర్యలతో వేధించిన ఘటన నల్లజర్ల మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. దీనిపై పోక్సో కేసు నమోదు చేశారు. పాఠశాలలో 4,5 తరగతి చదువుకుంటున్న చిన్నారులు స్కూల్ అయ్యాక ఆడుకుంటుండగా వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ఆయిల్‌పామ్ తోటలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఓ బాలుడు తన తల్లికి చెప్పగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సాయంతో సీఐ రాంబాబు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

Similar News

News December 6, 2025

8న పీజీఆర్‌ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

డిసెంబర్ 8న రాజమండ్రి కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ సచివాలయ స్థాయిల్లో PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యమన్నారు. అర్జీదారులు తమ వినతిపత్రాలను Meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని ఆమె చెప్పారు.

News December 6, 2025

హోంగార్డుల సేవలు కీలకం: ఎస్పీ

image

63వ హోంగార్డ్స్ ఆవిర్భావ వేడుకలను శనివారం రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంగార్డులు నిస్వార్థ సేవలు అందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సేవా దృక్పథంతో విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ కొనియాడారు. పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు కీలకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

News December 6, 2025

తూ.గో. జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం: జేసీ

image

తూ.గో. జిల్లాలో ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతోందని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 35,391 మంది రైతుల నుంచి 2,63,423.160 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మొత్తం విలువ రూ. 601.79 కోట్లు కాగా, ఇందులో ఇప్పటికే రూ. 540.08 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు.