News April 10, 2025
నల్లజర్ల: వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు

చిన్నారులను HIV ఉన్న ఓ వృద్ధుడు లైంగిక చర్యలతో వేధించిన ఘటన నల్లజర్ల మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. దీనిపై పోక్సో కేసు నమోదు చేశారు. పాఠశాలలో 4,5 తరగతి చదువుకుంటున్న చిన్నారులు స్కూల్ అయ్యాక ఆడుకుంటుండగా వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ఆయిల్‌పామ్ తోటలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఓ బాలుడు తన తల్లికి చెప్పగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సాయంతో సీఐ రాంబాబు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News April 25, 2025
రాజనగరం: భారతదేశం ఆకృతిలో వైద్య విద్యార్థులు

కశ్మీర్లో ఉగ్రవాదుల దురాగతానికి బలైపోయిన పర్యాటకులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాల మైదానంలో వైద్య విద్యార్థులు కొవ్వత్తులతో గురువారం రాత్రి మౌన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ‘భారతదేశం ఆకృతి’లో వారంతా మానవహారంగా ఏర్పడి, ‘మనం భారతీయులం – మనది అఖండ భారతం’ అంటూ హిందీ, ఇంగ్లీష్, తమిళ, మలయాళం, ఒరియా, బెంగాలీ భాషలలో ఉద్వేగంగా నినాదం ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి సంఘీభావాన్ని తెలిపారు.
News April 24, 2025
నిడదవోలు: చూపరులను కంటతడి పెట్టిస్తున్న ఫ్లెక్సీ

నిడదవోలుకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎం.ప్రకాష్ కుమార్ ఇటీవల కొవ్వూరు మండలం చిగురులంక వద్ద గోదావరిలో గల్లంతై ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ప్రకాష్ కుమార్ ఆదరణ కూడిక సందర్భంగా అతని ఫ్రెండ్స్ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ చూపరులను కంటతడి పెట్టిస్తుంది. నిన్న విడుదలైన పది ఫలితాలలో 533 మార్కులు సాధించాడు. మిత్రులందరూ చంటినీ మార్కుల జాబితా అంటూ మార్కుల షీట్‌ను ఫ్లెక్సీ వేయించారు.
News April 24, 2025
తండ్రిని చంపించింది రాజమండ్రిలో ఉంటున్న కొడుకే

అనకాపల్లి (D) చినకలువలాపల్లిలో జరిగిన వడ్డీ వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జల్లి తాతారావును కొడుకు అప్పలరెడ్డే హత్య చేయించాడని, తండ్రి తన ఆస్తిని సవతి తల్లి కుమార్తెకు ఇచ్చేస్తాడని భావించి ఇద్దరిని పురమాయించి హత్య చేయించినట్లు వెల్లడించారు. రాజమండ్రిలో ఉంటున్న అప్పలరెడ్డితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.