News March 26, 2025
నల్లజర్ల : శిశువు మృతి

నల్లజర్ల ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు పీకుతుండగా.. స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే శిశువు చికిత్స పొందుతూ రా.12 గం.లకు మరణించిందని సీడీపీఓ నాగలక్ష్మి తెలిపారు. ఘటనపై FIR చేయించామని, వివరాల సేకరణకు అంగనవాడీ సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు.
Similar News
News November 28, 2025
పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలలకు 35 కొత్త కంప్యూటర్లు

పెద్దపల్లి జిల్లా పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ 35 డెల్ వాస్ట్రో i3 కంప్యూటర్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. కలెక్టర్ అనుమతితో వచ్చిన ఈ కంప్యూటర్లు నవంబర్ 30లోపు సంబంధిత పాఠశాలలకు చేరేలా టీమ్లను ఏర్పాటు చేయాలని శాఖ ఆదేశించింది. పంపిణీ చర్యలపై వివరాల కోసం SIET సెక్షన్ అధికారి మల్లేష్ గౌడ్ (9959262737) ను సంప్రదించాలని ప్రకటించింది.
News November 28, 2025
కోటిలింగాల ఆలయానికి ₹2,73,695 ఆదాయం

కార్తీకమాసం ముగిసిన సందర్భంగా కోటిలింగాల కోటేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి మొత్తం రూ.2,73,695 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ అధికారులు హామీ ఇచ్చారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రాజా మొగిలి, ఈవో కాంతరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేష్ పాల్గొన్నారు.
News November 28, 2025
భోగాపురం కనెక్టివిటీపై బ్రేకులు

భోగాపురం విమానాశ్రయానికి కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు VMRDA ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ రహదారుల ప్రాజెక్ట్పై పురోగతి కనబడటం లేదు. VMRDA ఏడాది క్రితం రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేసింది. ట్రాఫిక్ను అరికట్టాలనే లక్ష్యంతో ప్లాన్ చేసినా.. భూసేకరణ, వివాదాలు పనులకు అడ్డంకిగా మారాయి. ఏడాది క్రితమే ప్రాసెస్ ప్రారంభమైనా పురోగతి కనబడకపోవడంతో ట్రాఫిక్ తిప్పలు తప్పవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


