News January 2, 2025

నల్లజర్ల: సినిమా ముహూర్తాల సిద్ధాంతి సత్యనారాయణ కన్నుమూత

image

నల్లజర్ల మండలం సింగరాజుపాలేనికి చెందిన ప్రముఖ సిద్ధాంతి కొఠారు సత్యనారాయణ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన జ్యోతిష్య, వాస్తు, సినిమాకు ముహూర్తాలు పెట్టడంతో జిల్లా వాసులకు సుపరిచితుడు.

Similar News

News January 8, 2025

పిఠాపురం: అక్కాచెల్లెళ్లను మోసగించిన వ్యక్తికి 30 ఏళ్లు జైలు శిక్ష

image

పిఠాపురానికి చెందిన అక్కాచెల్లెళ్లను అదే గ్రామానికి చెందిన హేమంత్ ప్రేమ పేరుతో మోసం చేయడంతో అతడికి 30ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించింది. ఈ మేరకు కాకినాడ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి శ్రీదేవి మంగళవారం తీర్పు చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిపై రెండేళ్లపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికల తండ్రి ఫిర్యాదుతో 2019లో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

News January 8, 2025

గొల్లప్రోలు: పదో తరగతి విద్యార్థి కత్తితో హల్ చల్

image

పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి గొల్లప్రోలులో మంగళవారం నడిరోడ్డుపై కత్తితో హల్ చల్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. మండల పరిధిలోని చెందుర్తి గ్రామానికి చెందిన ఆ విద్యార్థి స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చెందుర్తి గ్రామానికి చెందిన మరో విద్యార్థినిపై దాడి చేసి స్థానికులను కత్తితో బెదిరించాడు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.

News January 8, 2025

యూరియా కొరత లేకుండా చూడాలి: మంత్రి కందుల

image

తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎరువులను సరఫరా చేయాలని సూచించినట్లు తెలిపారు. జనవరి 10వ తేదీ లోపు 2500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు రంగం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.