News January 2, 2025

నల్లజర్ల: సినిమా ముహూర్తాల సిద్ధాంతి సత్యనారాయణ కన్నుమూత

image

నల్లజర్ల మండలం సింగరాజుపాలేనికి చెందిన ప్రముఖ సిద్ధాంతి కొఠారు సత్యనారాయణ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన జ్యోతిష్య, వాస్తు, సినిమాకు ముహూర్తాలు పెట్టడంతో జిల్లా వాసులకు సుపరిచితుడు.

Similar News

News January 20, 2025

సీఎం, డిప్యూటీ సీఎంకు హరిరామ జోగయ్య లేఖ

image

మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు హరిరామ జోగయ్య సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కి లేఖ రాశారు. కాపులకు 5% రిజర్వేషన్ అమలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. వైసీపీ కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి రిజర్వేషన్ అమలు చేయలేదని మండిపడ్డారు. గతంలో తాను నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ రిజర్వేషన్ అంశంలో కలిసి పనిచేద్దామని చెప్పారన్నారు. పవన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

News January 20, 2025

యువకుడితో మృతితో పేరవరంలో విషాద ఛాయలు

image

ప్రత్తిపాడు(M) ధర్మవరం వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో శివ(22) అనే యువకుడు <<15196950>>మృతి చెందిన<<>> సంగతి తెలిసిందే. బైక్‌పై నిదానంగానే వెళ్తున్నా మృత్యువు లారీ రూపంలో వచ్చి బలితీసుకుంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తుండగా ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరిగింది. వెళ్లొస్తా అంటూ హుషారుగా ఇంట్లో చెప్పి వెళ్లిన కుర్రాడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. స్వగ్రామం పేరవరంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News January 20, 2025

నిడదవోలు విద్యార్థి విజయనగరంలో ఆత్మహత్య

image

తూ.గో జిల్లా నిడదవోలుకు చెందిన MBBS వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్ ఆదివారం నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ సభ్యుల వేదనకు తానే కారణమవుతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.