News October 17, 2024
నల్లపాడు పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్.?

జగన్ అభిమాని అని చెప్పుకుంటూ గత ప్రభుత్వ హయాంలో టీడీపీపై విమర్శలు చేసిన బోరుగడ్డ అనిల్ని నల్లపాడు పోలీసులు బుధవారం అదుపులో ఉన్నట్లు సమాచారం. ఆయనపై పలు అంశాల్లో గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నల్లపాడు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్లపాడు స్టేషన్ కంటే ముందు పట్టాభిపురం స్టేషన్లో అనిల్ను విచారించినట్లు సమాచారం.
Similar News
News November 23, 2025
తాడేపల్లి: వర్ల రామయ్యపై YCP నేతల ఫిర్యాదు

టీడీపీ నేత వర్ల రామయ్యపై వైసీపీ SC సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఇటీవల YS జగన్ ACB కోర్టుకు వెళ్లిన సందర్భంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఓ అభిమాని చూపిన ప్లకార్డును గురించి వర్ల ప్రెస్ మీట్ పెట్టి తమ పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అభిమానుల వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ నిర్ణయాలుగా చూపుతున్నారని విమర్శించారు.
News November 23, 2025
గుంటూరు: రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా శ్రీనివాసరావు

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నామినేటెడ్ పదవుల కేటాయింపులో గుంటూరుకు ప్రాధాన్యత దక్కింది. ఈమేరకు రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా కళ్యాణం శివ శ్రీనివాసరావు నియమితులయ్యారు. జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్గా ప్రస్తుతం ఆయన పని చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడుగా పేరు పొందారు. ఆయన నియామకం పట్ల జనసేన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
News November 23, 2025
గుంటూరులో నాన్ వెజ్ ధరలు ఇవే.!

గుంటూరులో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ.200, విత్ స్కిన్ రూ.180గా విక్రయిస్తున్నారు. మటన్ కేజీ ధర రూ.1050 పలుకుతోంది. ఇక చేపలు బొచ్చెలు, రాగండి ఇలా రకాలను బట్టి కేజీ రూ.200 నుంచి రూ.280 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


