News December 29, 2024
నల్లబెల్లి: కూతురు, తల్లి సూసైడ్ ATTEMPT

కూతురికి పురుగు మందు తాగించి తల్లి కూడా తాగిన ఘటన నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. శ్రీను సంతానం కోసం మానసను రెండో వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవితంలో విఘ్నేశ్, సాత్విక జన్మించారు. కాగా కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తాను పురుగు మందు తాగి కూతురికి కూడా తాగించింది. గమనించిన స్థానికులు 108లో నర్సంపేట ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 14, 2025
వరంగల్: అదే పరిస్థితి.. మద్యం టెండర్లకు విముఖత..!

వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న మద్యం షాపులకు టెండర్లు వేసేందుకు వ్యాపారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 15 మద్యం షాపులకు గాను 31 మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఒక్కో మద్యం షాపుపై ఇప్పటివరకు కనీసం పదికి పైగా కూడా దరఖాస్తులు రాలేదు. దీంతో ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
News October 14, 2025
బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావుకు ఘన స్వాగతం

వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు బయలుదేరారు. మార్గమధ్యంలో ఖాజీపేట రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగానే జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి, ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలను రాంచందర్రావు పలకరించి, ముందుకు సాగారు.
News October 12, 2025
వరంగల్: 97%తో రికార్డు స్థాయిలో పల్స్ పోలియో

నేటి ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా జరిగింది. మొత్తం 20,101 మంది పిల్లలకు లక్ష్యంగా, 19,546 మందికి పోలియో వ్యాక్సిన్ వేసి 97 శాతం రికార్డు సాధించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.సాంబశివరావు తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు పోలియో చుక్కలు తప్పక వేయించాలన్నారు.