News February 22, 2025
నల్లమల అడవుల్లో దారి తప్పిన భక్తులు

తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్‌కు చెందిన కొందరు శివస్వాములు పాదయాత్రతో శ్రీశైలం వస్తూ నల్లమల అటవీ ప్రాంతంలో దారి తప్పారు. మనోజ్, గురుప్రసాద్, రాజు, గోపాల్, మరో ముగ్గురు ఆత్మకూరు పరిధిలోని ఇందిరేశ్వరం గ్రామం నుంచి గూగుల్ మ్యాప్ ద్వారా అడవి ప్రాంతంలోకి ప్రవేశించి, దారి తప్పారు. పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీం జీపీఎస్ ఆధారంగా వారుండే ప్రాంతానికి చేరుకుని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Similar News
News March 17, 2025
పాయకరావుపేట: పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్

రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎటువంటి భయాందోళనలు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ట్విట్టర్ ద్వారా విద్యార్థులకు సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
News March 17, 2025
నిరుద్యోగ యువత అప్లై చేసుకోవాలి: పీవో

రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువత స్వయం ఉపాధి పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తిగల గిరిజన నిరుద్యోగులు https://tgobmmsnew.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ఏప్రిల్ 5 లోపు అప్లై చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
News March 17, 2025
VZM: ఆరుగురిపై కేసు నమోదు

ఖాళీ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై విజయనగరం జిల్లా పోలీసులు దృష్టి సారించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో నిఘా పెట్టి వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఆదివారం సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం శివారులో బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై రాజాం పోలీసులు దాడులు చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఆరుగురు మందుబాబులపై కేసు నమోదు చేశారు.