News July 30, 2024
నల్లమల ఫారెస్ట్‌లో 87కు చేరిన పెద్ద పులుల సంఖ్య

నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులుల సంఖ్య 87కి చేరిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దేశంలోనే అతి పెద్దదైన శ్రీశైలం- నాగార్జునసాగర్ టైగర్ ప్రాజెక్ట్‌లో 2014 సంవత్సరంలో పెద్ద పులుల సంఖ్య 48గా ఉండగా.. 2022కు ఆ సంఖ్య 62కు చేరిందన్నారు. ప్రస్తుతం ఆ పెద్ద పులుల సంఖ్య 87. అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణకై 800 మంది చెంచు గిరిజనులు పనిచేస్తున్నారని DFO విఘ్నేశ్ అప్పావ్ తెలిపారు.
Similar News
News November 24, 2025
రాచర్ల: పొలంలో నీళ్లు పెడుతుండగా.. కరెంట్ షాక్‌కి గురై..

రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన చిట్టిబాబు చిన్న కుమారుడు రాజేశ్ విద్యుత్ షాక్‌కు గురై ఆదివారం మృతి చెందారు. మొక్కజొన్న పొలంలో నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
News November 24, 2025
ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.