News January 3, 2025

నల్లమల విద్యార్థికి బంగారు పతకం 

image

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలంలోని ఉడిమిళ్ల గ్రామానికి చెందిన విద్యార్థి భరత్ గురువారం జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. భరత్ ప్రస్తుతం అచ్చంపేట రెసిడెన్సియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని పలువురు ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు. 

Similar News

News January 8, 2025

మహబూబ్‌నగర్‌లో తాత్కాలికంగా పలు రైళ్ల రద్దు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో రైల్వే పనుల మరమ్మతుల కారణంగా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లా మీదుగా సికింద్రాబాద్ – కర్నూల్ సిటీ తుంగభద్ర రైలు కర్నూలు – గద్వాల మధ్య పట్టాల మరమ్మతుల కారణంగా ఈ రైలు గద్వాల వరకు మాత్రమే నడవనుంది. కాచిగూడ – MBNR రైలు షాద్‌నగర్ వరకు మాత్రమే నడవనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరుతున్నారు.

News January 8, 2025

MBNR: క్రీడల్లో నిబంధనలు నామమాత్రమేనా?

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,227 ప్రభుత్వ పాఠశాలలుంటే 3.50 లక్షల మంది విద్యార్థులు, 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా..17,500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో 275 మంది PEDలు, 45 మంది PETలు మాత్రమే ఉన్నారు.250 మంది విద్యార్థులకు ఒక పీఈటీ ఉండాలన్న నిబంధన నామమాత్రమే. ప్రభుత్వం క్రీడలపై దృష్టి పెట్టి వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు కోరుతున్నారు.

News January 8, 2025

NRPT: డిస్ట్రిక్ట్ ఎక్స్‌పోర్ట్ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేయండి: కలెక్టర్

image

డిస్టిక్ ఎక్స్ పోర్ట్ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. మంగళవారం ఎక్స్‌పోర్ట్ యాక్షన్ ప్లాన్‌పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రెడ్ ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ శైలజ హైద్రాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా నుంచి ఇతర దేశాలకు వరి, పత్తి, చేనేత వస్త్రాలు ఎక్స్ పోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ చెప్పారు.