News March 1, 2025

నల్లొండ: చదువుకు వయసుతో సంబంధం లేదు: కలెక్టర్ 

image

చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని మహిళలు చదువుకుంటే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నేడు జిల్లా కేంద్రంలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి శిక్షణ పొందుతున్న మహిళలతో ఆమె మాట్లాడారు. 50 సంవత్సరాల తర్వాత చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నవారూ ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 2, 2025

పెద్ద కాపర్తి యాక్సిడెంట్‌లో నల్గొండ యువకులు మృతి

image

చిట్యాల మండలం <<15626572>>పెద్దకాపర్తిలో <<>>జరిగిన ప్రమాదంలో నల్గొండకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాలు.. నల్గొండ మాన్యంచెల్కకు చెందిన నవాజ్, సోహైల్, సల్మాన్, షోయబ్ వెల్డింగ్ పని చేస్తారు. హైదరాబాద్‌లో వెల్డింగ్ పని ముగించుకొని వస్తుండగా ముందు ఉన్న బస్ సడన్‌గా ఆగడంతో కారు బస్ కిందికి దూసుకుపోయింది. దీంతో నవాజ్, సోహైల్ స్పాట్‌లోనే చనిపోయారు. సల్మాన్, షోయబ్ చికిత్స పొందుతున్నారు.

News March 2, 2025

BREAKING: చిట్యాలలో ఘోర ప్రమాదం

image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, కంటైనర్, రెండు కార్లు ఢీకొనడంతో ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న కారును కంటైనర్ ఢీకొట్టింది. దీంతో కారు.. బస్సు కిందికి దూసుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 2, 2025

దేవరకొండ: భార్యభర్తల మధ్య గొడవ.. ఒకరు మృతి

image

భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భార్య మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ముదిగొండలో జరిగింది. సీఐ నరసింహులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్తెం లక్ష్మయ్య వెంకటమ్మ దంపతులు మద్యం తాగుతూ అప్పుడప్పుడు గొడవ పడుతుండేవారని, శుక్రవారం రాత్రి జాతర సందర్భంగా మద్యం సేవించి గొడవపడడంతో ఆ గొడవలో భర్త లక్ష్మయ్య భార్యను నెట్టేయడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

error: Content is protected !!