News March 2, 2025

నల్లొండ: చదువుకు వయసుతో సంబంధం లేదు: కలెక్టర్ 

image

చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని మహిళలు చదువుకుంటే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నేడు జిల్లా కేంద్రంలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి శిక్షణ పొందుతున్న మహిళలతో ఆమె మాట్లాడారు. 50 సంవత్సరాల తర్వాత చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నవారూ ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 26, 2025

మునుగోడు: పత్తి మిల్లులో అనుమానాస్పదంగా కార్మికుడు మృతి

image

మునుగోడు మండలం కొంపల్లిలోని జై బిందు పత్తి కొనుగోలు కేంద్రంలో మహారాష్ట్రకు చెందిన కార్మికుడు ముస్తఫా జాఫర్ సాఫ్ జలాలు (30) మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. తహశీల్దార్ నరేష్, చండూరు సీఐ ఆదిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనుమానం ఉన్న శార్దూల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు.

News November 26, 2025

నల్గొండ: చనిపోతూ ముగ్గురికి లైఫ్ ఇచ్చారు

image

చండూరుకు చెందిన రైతు పాలకూరి రామస్వామి (75) బైక్ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆయన కుటుంబ సభ్యుల అంగీకారంతో మూడు నిండు జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవయవదానం చేశారు. మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ కుటుంబ సభ్యులకు వీసీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. అవయవదానం-మహాదానం అని ఆయన పేర్కొన్నారు.

News November 26, 2025

నల్గొండ: సర్పంచ్ ఎలక్షన్స్.. ఏ డివిజన్‌లో ఎప్పుడంటే..

image

రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. చండూరు డివిజన్ పరిధిలో 14 మండలాలు ఉండగా వీటికి మొదటి విడత డిసెంబర్ 11న , మిర్యాలగూడ డివిజన్ పరిధిలో పది మండలాలు ఉండగా రెండో విడత డిసెంబర్ 14న, దేవరకొండ డివిజన్ పరిధిలో తొమ్మిది మండలాల్లో మూడో విడత డిసెంబర్ 17న ఎన్నికలు నిర్వహించనున్నారు.