News October 29, 2024
నవంబర్ 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: కలెక్టర్
ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ నవంబర్ 1న ఉదయం 6 గంటలకే మొదలు కావాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 2,85,004 పెన్షన్లు ఉండగా, అందుకు సంబంధించి రూ.120,09,75,000 పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. బ్యాంకులలో నగదు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈనెల 30వ తేదీనే బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలన్నారు.
Similar News
News November 5, 2024
నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లాలో త్వరలో నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు నిర్వహించనున్నామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలలో ఇరిగేషన్ అధికారులు ప్రతి ఉత్సాహం చూపకూడదని కలెక్టర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా జల వనరుల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి సంఘం ఎన్నికల మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
News November 5, 2024
కూటమి నాయకులతో ఇన్ఛార్జి మంత్రి సమీక్ష
కడప జిల్లాలోని ఎన్డీఏ కూటమి నాయకులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. మంగళవారం కడపలోని రహదారులు భవనాల శాఖ అతిథి గృహం నందు ఎన్డీఏ కూటమి నాయకులతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూటమినేతలు కలిసికట్టుగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు.
News November 5, 2024
శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం.. మూగ మహిళపై అత్యాచారం!
శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచార ఘటన మరువక ముందే మరో దారుణం జరిగింది. సోమందేపల్లి మండలంలోని ఓ గ్రామంలో సోమవారం రాత్రి ఓ మూగ మహిళపై ఆదే గ్రామానికి చెందిన రామాంజి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.