News October 23, 2024

నవంబర్ 18 నుంచి అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

Similar News

News November 15, 2024

అమలాపురం: ఫైనాన్స్ బిడ్‌లను ఓపెన్ చేసిన జేసీ

image

కోనసీమ జిల్లాలో ఇసుక త్రవ్వకాలు, వాహనాలలో లోడింగ్ స్టాక్ యార్డులకు తరలింపు, తిరిగి వాహనాల్లో లోడింగ్ ఛార్జీల వసూళ్లు నిమిత్తం పిలిచిన ఫైనాన్స్ బిడ్లను గురువారం రాత్రి జాయింట్ కలెక్టర్ నిషాంతి, జిల్లాస్థాయి ఇసుక కమిటీ సభ్యుల సమక్షంలో అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఓపెన్ చేశారు. ఈ ఫైనాన్స్ బిడ్‌లలో తక్కువ రేటు కోడ్ చేసిన ఏజెన్సీలకు ఇసుక రీచుల ఆపరేషన్ నిర్వహణను అప్పగించడం జరుగుతుందని ఆమె తెలిపారు.

News November 14, 2024

ముమ్మిడివరం: నటుడు పోసానిపై ఫిర్యాదు

image

సినీ నటుడు పోసాని కృష్ణ మురళీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో గురువారం జర్నలిస్ట్ రమేశ్ ఫిర్యాదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు ఛైర్మన్‌ను కించపరుస్తూ మాట్లాడారని చెప్పారు. నటుడు కృష్ణ మురళిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇటీవల రాజమండ్రిలో కూడా పోసానిపై ఫిర్యాదు చేశారు.

News November 14, 2024

పంచారామక్షేత్రంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె పూజలు

image

సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయాన్ని మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మితా  దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఆమె ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలు అందించారు. ఆమె మాట్లాడుతూ.. కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.