News October 23, 2024

నవంబర్ 18 నుంచి అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

Similar News

News November 10, 2024

దీపం-2 పథకానికి అద్భుతమైన ప్రజాస్పందన: హోమంత్రి అనిత

image

దీపం-2 పథకానికి అద్భుతమైన ప్రజా స్పందన వస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ‘ఎక్స్’లో పేర్కొన్నారు. సూపర్-6 హామీల్లో ఒకటిగా ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 7వ తేదీ సాయంత్రానికి 5,17,383 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.41.17 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం జమ చేసినట్లు వివరించారు.

News November 9, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాలో నామినేటడ్ పదవులు వీరికే..

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో పలువురికి నామినేటెడ్ పదవులు వరించాయి. రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎం.సురేంద్ర, కొప్పల వెలమ ఛైర్మన్‌గా PVG కుమార్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నాగేశ్వరరావు, AP కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా జి.బాబ్జి, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఛైర్మన్‌గా S.సుధాకర్, GCC ఛైర్మన్‌గా K. శ్రావణ్ కుమార్ VMRDA ఛైర్మన్‌గా ప్రణవ్ గోపాల్ నియమితులయ్యారు.

News November 9, 2024

అనకాపల్లి: గవర కార్పొరేషన్ చైర్మన్‌గా మళ్ళ సురేంద్ర

image

రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ ‌గా అనకాపల్లికి చెందిన టీడీపీ నాయకుడు మళ్ల సురేంద్రను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. శనివారం కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేట్ పదవుల జాబితాలో సురేంద్రకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ.. తన పై నమ్మకంతో అవకాశం కల్పించిన చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపారు.