News October 31, 2024
నవంబర్ 2 నుంచి ఏడుపాయలలో ప్రతి రోజు కార్తీక దీపోత్సవం: ఈఓ
కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 2 నుంచి ఏడుపాయలలో వనదుర్గమాత ఆలయం వద్ద ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి సామూహిక దీపోత్సవం జరుగుతుందని ఈఓ చంద్రశేఖర్ రావు తెలిపారు. మట్టి ప్రమిదలు దేవస్థానం నుంచి ఉచితంగా ఇవ్వబడుతుందన్నారు. ఈ నెల 15న సాయంత్రం 6 గంటలకు దీపోత్సవం, పల్లకి సేవ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు సాయంత్రం దీపాలు వెలిగించడం జరుగుతుందన్నారు.
Similar News
News October 31, 2024
జహీరాబాద్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడి అరెస్ట్
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు తెలిపారు. వికారాబాద్ జిల్లా జీవంగి గ్రామానికి చెందిన వినీల్ 7 నెలల క్రితం ఇన్స్టాలో న్యాల్కల్ మండలం రాఘవపూర్ చెందిన ఓ బాలిక(15)తో పరిచయం ఏర్పడింది. బాలిక గ్రామానికి వచ్చి, ఊరి శివారులో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదుతో యువకుడిని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదయిందన్నారు.
News October 31, 2024
జిన్నారం: నవంబర్ 2న ఉమ్మడి జిల్లా క్రికెట్ ఎంపికలు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 2న ఉమ్మడి జిల్లా క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ అమూల్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిన్నారం టీటీడబ్ల్ఆర్ఎస్ పాఠశాలలో అండర్ 17 బాలుల క్రికెట్ ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఉ.9 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 6281440401,9505796688 నంబర్లను సంప్రదించాలని కోరారు.
News October 31, 2024
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దీపావళి సందర్భంగా కేసీఆర్ ప్రార్థించారు.