News November 26, 2024

నవంబర్ 26: చరిత్రలో ఈ రోజు

image

1949: భారత రాజ్యాంగం ఆమోదం పొందింది.
1967: విండీస్ మాజీ క్రికెటర్ రిడ్లీ జాకబ్స్ జననం.
2006: సినీ నటి జి.వరలక్ష్మి మరణం
2008: ముంబైలో ఉగ్ర దాడి, 160 మందికిపైగా మృతి
* జాతీయ న్యాయ దినోత్సవం
* జాతీయ పాల దినోత్సవం

Similar News

News November 26, 2024

నేటి నుంచి భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు నెల్లూరు, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశంలో 3 రోజులు వానలుంటాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News November 26, 2024

గుడ్ల ఉత్పత్తిలో ఏపీ వెరీ గుడ్

image

AP: FY23లో గుడ్లు, ఆయిల్‌పామ్ ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మాంసం ఉత్పత్తిలో నాలుగు, పాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో నిలిచినట్లు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన 2023-24 ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఆ కాలంలో 2,78,498 లక్షల గుడ్లు, 10.94 లక్షల టన్నుల మాంసం, 154 లక్షల టన్నుల పాల దిగుబడి సాధించినట్లు తేలింది. 18.95 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తి అయినట్లు పేర్కొంది.

News November 26, 2024

IPL: తెలంగాణ క్రికెటర్‌కు నో ఛాన్స్

image

IPL-2025 మెగా ఆక్షన్‌లో తెలంగాణ క్రికెటర్ అరవెల్లి అవనీశ్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. రూ.30లక్షల బేస్ ప్రైస్‌తో అతను వేలానికి రిజిస్టర్ చేసుకున్నారు. గత సీజన్‌లో CSK అతడిని కొనుగోలు చేసినా తుది జట్టులో ఆడించలేదు. ఈసారి ఐపీఎల్‌లో సత్తా చాటుదామనుకుంటే ఏ జట్టు తీసుకోకపోవడంతో అతనికి నిరాశ ఎదురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోత్గల్‌కు చెందిన ఈ 19 ఏళ్ల వికెట్ కీపర్ భారత U19 జట్టుకూ సెలక్ట్ అయ్యారు.