News October 25, 2024
నవంబర్ 7న బీసీ కమిషన్ ఛైర్మన్ రాక: రంగారెడ్డి కలెక్టర్

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయాలను తెలుసుకునేందుకు తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం నవంబర్ 7న రంగారెడ్డి జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. ఇందులో భాగంగా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నవంబర్ 7న రంగారెడ్డి కలెక్టరేట్లో కమిషన్ ఛైర్మన్ నిరంజన్ నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు.
Similar News
News October 15, 2025
సికింద్రాబాద్: రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం

గుంటూరు నుంచి చర్లపల్లి వస్తున్న ట్రైన్లో దారుణం జరిగింది. పోలీసుల వివరాలిలా.. సోమవారం రాత్రి రైలులో ఒంటరిగా ఉన్న మహిళ(35)ను దుండగుడు కత్తితో బెదిరించి, హ్యాండ్ బ్యాగ్, సెల్‌ఫోన్ లాక్కొని, అత్యాచారం చేశాడు. అనంతరం APలోని పెద్దకూరపాడు స్టేషన్ వద్ద దిగి పారిపోయాడు. బాధితురాలు మంగళవారం చర్లపల్లికి రాగానే GRP పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
News October 15, 2025
HYD: ఎదలోతులో.. ఏమూలనో నిదురించు జ్ఞాపకాలు..

90‘sలో స్కూలుకు వెళ్లేటప్పుడు అమ్మనాన్న ఇచ్చిన ఆటానా, చారాణా మనకెంతో గొప్ప. వాటితో స్కూలు గేటు ముందు చాక్లెట్లు, నారింజ మిఠాయి, కొబ్బరుండలు కొనుక్కొని షర్ట్ అడ్డుపెట్టి కొరికి స్నేహితులతో పంచుకునేవాళ్లం. బాల్యంలో చేసినవి గుర్తొస్తే కళ్లవెంబడి నీళ్లొస్తాయి కదా? అబ్దుల్లాపూర్‌మెట్‌లోని RNR కాలనీ ప్రభుత్వ పాఠశాల వద్ద పిల్లలు గేట్ ముందు కొనుక్కుంటూ కనిపించారు. స్కూల్ లైఫ్ ఎప్పటికీ ఎవర్గ్రీన్.
News October 15, 2025
ఓయూ రిజిస్ట్రార్‌కు ‘బెస్ట్ రీసెర్చ్ పేపర్’ అవార్డు

ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డికి ‘బెస్ట్ రీసెర్చ్ పేపర్’ అవార్డు లభించింది. ద ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్(ఐఏఏ) నిర్వహించిన 47వ ఆల్ ఇండియా అకౌంటింగ్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జనార్దన్ రాయ్ నగర్ రాజస్థాన్ విద్యాపీఠ్(డీమ్డ్ యూనివర్సిటీ)లో ఈనెల 12, 13 తేదీల్లో ఈ సదస్సు జరిగింది.