News January 29, 2025

నవాబుపేట: నలుగురు కొట్టి చంపారు

image

ఓ వ్యక్తిని నలుగురు కొట్టి చంపిన ఘనట నవాబుపేట (M) మరికల్‌లో జరిగింది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సింహులు అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె సోదరులు గొడవలు పెట్టుకున్నారు. అతడి బైక్‌కి నిప్పంటించారు. మంగళవారం పొలంలో ఒంటరిగా ఉన్న నర్సింహులుపై నలుగురు దాడి చేశారు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదైంది.

Similar News

News December 2, 2025

రాజీనామా వెనక్కి తీసుకున్న జకియా ఖానం!

image

AP: శాసనమండలి అభ్యర్థిత్వానికి రాజీనామా చేసిన ఆరుగురు MLCలను ఛైర్మన్ మోషేన్ రాజు నిన్న పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా జకియా ఖానం తన రాజీనామా వెనక్కి తీసుకున్నారు. పదవీకాలం 7నెలలే మిగిలి ఉందని, ఎన్నిక నిర్వహించడానికి టైం ఉండదని ఛైర్మన్ చెప్పడంతో రాజీనామా ఉపసంహరించుకున్నారు. మిగతా MLCలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, సునీత, జయమంగళ, మర్రి రాజశేఖర్‌లు తమ రాజీనామాలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

News December 2, 2025

వైకుంఠ ద్వార దర్శనం.. నేడు ఈ-డిప్

image

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల వివరాలను నేడు TTD విడుదల చేయనుంది. వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి 24 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 1.8 లక్షల టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు ఇవాళ మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

News December 2, 2025

US, UK ఒప్పందం.. ఔషధాలపై ‘0’ టారిఫ్

image

అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. UK నుంచి USకు ఎగుమతి అయ్యే ఔషధాలపై సున్నా టారిఫ్‌లు అమలయ్యేలా ఇరుదేశాలు అంగీకారం తెలిపాయి. దీనికి బదులుగా ఔషధాల ఆవిష్కరణలకు అమెరికాలో యూకే 25శాతం అధిక పెట్టుబడులు పెట్టనుంది. దీంతో అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది. ఏటా కనీసం 5బిలియన్ డాలర్ల విలువైన UK ఔషధాలు టారిఫ్ లేకుండా USలోకి ఎగుమతి అవుతాయి.