News January 29, 2025

నవాబుపేట: నలుగురు కొట్టి చంపారు

image

ఓ వ్యక్తిని నలుగురు కొట్టి చంపిన ఘనట నవాబుపేట (M) మరికల్‌లో జరిగింది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సింహులు అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె సోదరులు గొడవలు పెట్టుకున్నారు. అతడి బైక్‌కి నిప్పంటించారు. మంగళవారం పొలంలో ఒంటరిగా ఉన్న నర్సింహులుపై నలుగురు దాడి చేశారు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదైంది.

Similar News

News February 18, 2025

నెల్లూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

image

నెల్లూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <>లింకుపై<<>> క్లిక్ చేసి మీ పేరు, మండలం పేరు, పనిచేసిన సంస్థ పేరు నమోదు చేయండి.

News February 18, 2025

రేపు ఢిల్లీ సీఎం ఎంపిక, ఎల్లుండి ప్రమాణం

image

ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారంలో బీజేపీ స్వల్ప మార్పులు చేసింది. ఈ నెల 20న సా.4.30 గం.కు కాకుండా ఉ.11.30 గం.కు రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. రేపు మ.3.30 గం.కు బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై సీఎం పేరును ఖరారు చేయనుంది. రేసులో పర్వేశ్ వర్మ, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్ తదితరులు ఉన్నారు.

News February 18, 2025

HYD: ఫేక్ న్యూస్ ప్రధానమైన ముప్పు: సీఎం 

image

తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్‌గా మార్చేందుకు మనమంతా కలిసి పని చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. HYDలోని హెచ్ఐసీసీలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నేటి నుంచి 2 రోజుల పాటు షీల్డ్‌ -2025 కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలకు పరిష్కారాలను కొనుగొనడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సును సీఎం ప్రారంభించారు.

error: Content is protected !!