News January 23, 2025

నవీపేటలో బోల్తా పడిన స్కూల్ బస్సు

image

మండలంలోని కమలాపూర్ గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. నవీపేటకు చెందిన స్కూల్ బస్సు గురువారం ఉదయం పిల్లలను నాడాపూర్‌లో ఎక్కించుకొని వెళుతుండగా కమలాపూర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. కాగా బస్సులో ఉన్న విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News December 14, 2025

చైనా మాంజ విక్రయించినా, వినియోగించినా చర్యలు: NZB CP

image

సంక్రాంతి పండగ వస్తున్న తరుణంలో గాలిపటాల విక్రయ కేంద్రాల్లో చైనా మాంజాలు విక్రయించవద్దని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. చైనా మాంజా వల్ల ఎవరికైనా ప్రాణ హాని కలిగితే హత్య నేరం కింద కేసు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా పోలీస్ స్టేషన్‌ లేదా 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.

News December 14, 2025

నిజామాబాద్: వామ్మో చలి.. మూడు రోజులుగా వణుకు పుట్టిస్తోంది

image

గత మూడు రోజులుగా చలి గజగజ వణికిస్తోంది. దీంతో ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం నుంచి మొదలైన చలి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పంజా విసురుతోంది. పెరిగిన చలి తీవ్రతను తట్టుకోలేక చాలామంది ఎండలో నిలబడి ఉపశమనం పొందుతున్నారు. కొందరు ఇళ్లలోనే మంట కాచుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత వల్ల చాలామంది సర్ది, దగ్గు, జ్వరాల బారిన పడి కొందరు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

News December 14, 2025

NZB: 1,476 పోలింగ్ కేంద్రాలు.. 61 వెబ్ క్యాస్టింగ్ కేంద్రాలు

image

నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఆదివారం రెండో విడుత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొత్తం పోలింగ్ కేంద్రాలు-1,476, పీవోలు-1,476, ఓపీవోలు-1,937, సిబ్బంది తరలింపునకు రూట్లు-53, మైక్రో అబ్జర్వర్లు-56, జోనల్ అధికారులు-34, వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు-61ను సిద్ధం చేశారు. ఉదయం 7 గం. నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 2 గం. నుంచి ప్రారంభం అవుతుంది.