News August 18, 2024
నవీపేట్: అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు

కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన నవీపేట మండలంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఓ కుటుంబం కారులో బాసర వెళ్తుండగా నవీపేట మండలం అబ్బాపూర్ వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Similar News
News February 28, 2026
నవీపేట్: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.