News February 11, 2025

నవీపేట్: ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన నవీపేట్‌లో చోటుచేసుకుంది. అబ్బాపూర్ గ్రామానికి చెందిన అభిషేక్ ఇంటర్ 1st ఇయర్ ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు ఒప్పించి మళ్లీ కాలేజీలో జాయిన్ చేశారు. తోటి ఫ్రెండ్స్‌తో చదువు అర్థం కావడం లేదని మనస్తాపం చెంది గత నెల 27న పురుగుమందు తాగాడు. దీంతో వెంటనే అతడిని NZB హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

Similar News

News November 24, 2025

విశాఖ: ప్రియరాలితో వాగ్వాదం.. ప్రియుడి ఆత్మహత్య

image

గాజువాక సమీపంలోని తుంగ్లం పక్కన చుక్కవానిపాలెంలో రాజేశ్ రెడ్డి (30) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతితో నిన్న రాత్రి వాగ్వాదం జరగడంతో మనస్థాపం చెందిన రాజేశ్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి తల్లి, చెల్లి ఉన్నారు. వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 24, 2025

GNT: అన్నదాతల ఇంటికే ప్రభుత్వం- ‘రైతన్న మీకోసం’ ఆరంభం

image

గుంటూరు జిల్లాలో రైతుల కష్టాన్ని అర్థం చేసుకునేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది. రైతన్నా.. మీకోసం పేరుతో అధికారులు సోమవారం నుంచి నేరుగా రైతుల ఇళ్లను సందర్శించనున్నారు. పథకాలు ఎలా అందుతున్నాయి, ఎక్కడ జాప్యం ఉందో తెలుసుకుంటారు. పంచసూత్రాలు, యాంత్రీకరణ, సాంకేతిక పద్ధతులపై అవగాహన ఇస్తారు. రూ.14,000 పెట్టుబడి సహాయం అందించిన తర్వాత, ఇది మరో పెద్ద అడుగు అని అధికారులు చెబుతున్నారు.

News November 24, 2025

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. SP కీలక సూచన

image

రానున్న 4, 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. సోమశిల నుంచి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అజిత కోరారు. ఆదివారం 27,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాన్ని బట్టి సోమశిల నుంచి నీటిని విడుదల చేస్తారని అన్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.