News February 11, 2025
నవీపేట్: ఇంటర్ విద్యార్థి సూసైడ్

విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన నవీపేట్‌లో చోటుచేసుకుంది. అబ్బాపూర్ గ్రామానికి చెందిన అభిషేక్ ఇంటర్ 1st ఇయర్ ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు ఒప్పించి మళ్లీ కాలేజీలో జాయిన్ చేశారు. తోటి ఫ్రెండ్స్‌తో చదువు అర్థం కావడం లేదని మనస్తాపం చెంది గత నెల 27న పురుగుమందు తాగాడు. దీంతో వెంటనే అతడిని NZB హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
Similar News
News March 26, 2025
NGKL: గణితం పరీక్షకు 25 మంది గైర్హాజరు

నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా బుధవారం 10వ తరగతి పరీక్షల్లో భాగంగా గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 10,560 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 10,535 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని డీఈఓ రమేష్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అన్ని వసతులు కల్పించామని ఆయన పేర్కొన్నారు.
News March 26, 2025
ఖమ్మం: రూ.250 కోట్లతో మరో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ

ఖమ్మంలో తొలి ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వేంసూరు మండలం కల్లూరిగూడెంలో రూ.250 కోట్లతో, 48 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మించనుండగా, ఈ ఉగాదికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఒక ఫ్యాక్టరీ ఉండగా, మరొకటి వేంసూరులో నిర్మిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1.10లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతుండటం గమనార్హం.
News March 26, 2025
అసెంబ్లీలో ప్రతిపక్షంపై సీఎం సీరియస్

TG: శాంతిభద్రతలపై ప్రతిపక్ష BRS దుష్ప్రచారం చేస్తోందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని చూస్తే కుదరదన్నారు. విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలోనే దిశ ఘటన, వామనరావు హత్య జరిగిందని తెలిపారు. <<15866506>>MMTS ఘటనపై<<>> వెంటనే స్పందించామని పేర్కొన్నారు.