News February 9, 2025

నవీపేట్: కెమెరాల పని తీరును పరిశీలించిన DIEO

image

రెండో దశ ప్రయోగ పరీక్షలు జరుగుతున్న నవీపేట్ మోడల్ జూనియర్ కళాశాల, నవోదయ జూనియర్ కళాశాలల్లో కెమెరాల పని తీరును నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవి కుమార్ ఆదివారం స్వయంగా పరిశీలించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కెమెరాలకు జియో ట్యాగింగ్ ఉందా లేదా అని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెమరాలు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News April 17, 2026

NZB: 500 ఏళ్ల పురాతన క్షేత్రం.. నీలకంఠేశ్వర ఆలయం

image

నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ఆలయం సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన క్షేత్రం. ఉత్తర భారత శిల్పకళా రీతిలో ఉన్న ఈ కోవెల శివభక్తులకు పరమ పవిత్రం. ఇక్కడి శివలింగం, ఆలయ ప్రాకారం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి. శతాబ్దాలు గడిచినా నాటి నిర్మాణ చాతుర్యం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఈ పురాతన కట్టడాలను భావితరాలకు అందించాలి.
#నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం

News April 17, 2026

ఇందూరు కోట.. ఖిల్లా రఘునాథ ఆలయం

image

నిజామాబాద్ నగర నడిబొడ్డున ఎత్తైన గుట్టపై ఉన్న ఈ కోటను రాష్ట్రకూటులు నిర్మించగా, అనంతరం ఛత్రపతి శివాజీ దీనిని అభివృద్ధి చేశారు. ఇక్కడి రామమందిరం ఆధ్యాత్మికతకు నిలయం. కోటలోని రాతి కట్టడాలు, బురుజులు నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి సాక్ష్యాలు. పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం నుండి నగరం మొత్తాన్ని చూడవచ్చు. ఈ చారిత్రక సంపదను కాపాడుకోవడం మన బాధ్యత.
#నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం

News April 16, 2026

నిజామాబాద్: కీటక జనిత వ్యాధులపై నిఘా పెంచాలి – డీఎంహెచ్ఓ

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మలేరియా, డెంగ్యూ వంటి కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్ఓ డా.బి.రాజశ్రీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో RDT పరీక్షలు పెంచాలని, వివరాలను IHIP పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.