News January 29, 2025

నవీపేట్: జీవితం మీద విరక్తి చెంది వ్యక్తి మృతి

image

నవీపేట్ మండలం పాల్దే గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి జీవితం మీద విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి నిర్మాణం చేపట్టి అప్పులు ఎక్కువ కావడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగాడు. అతని భార్య వెంటనే 108 అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News October 24, 2025

NZB జిల్లాలో మద్యం దరఖాస్తులు ఎన్నంటే..?

image

మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియగా జిల్లాలోని 102 షాపులకు గానూ 2,786 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఒక్కో టెండర్‌కు రూ.3 లక్షల చొప్పున రూ.83.58కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గత టెండర్లలో 3,759 దరఖాస్తులు రాగా.. ఈసారి టెండర్లను రూ.3 లక్షలకు పెంచడంతో దరఖాస్తులు తగ్గాయి. కాగా ఈ నెల 27న భారతి గార్డెన్‌లో మద్యం దుకాణాల కేటాయింపు కోసం లక్కీ డ్రా నిర్వహించనున్నారు.

News October 24, 2025

NZB: 138 పేకాట కేసుల్లో 599 మంది పట్టివేత:CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 19 నుంచి 22 వరకు 138 పేకాట కేసులు నమోదు చేసి 599 మందిని పట్టుకున్నట్లు CP సాయి చైతన్య గురువారం తెలిపారు. ఈ కేసుల్లో రూ. 14,15,917 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. NZBడివిజన్లో 42 కేసులు, ARMRడివిజన్లో 44 కేసులు, బోధన్ డివిజన్ లో 52 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

News October 23, 2025

సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలి: కవిత

image

తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష నియామకాల్లో టీజీపీఎస్సీ… రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆర్టికల్ 371-డి ని ఉల్లంఘించిందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోని విచారించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌కు ఆమె లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం చేసిందన్నారు.