News September 23, 2024

నవోదయలో ప్రవేశాలకు మరోసారి గడువు పెంపు

image

వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తు గడువును మరోమారు పొడిగించినట్లు మండల విద్యాధికారి రామ్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం అక్టోబర్ 7వరకు పొడిగించినట్లు తెలిపారు. ఆసక్తిగలవారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News September 29, 2024

NGKL: లంచం తీసుకున్న కానిస్టేబుల్ సస్పెండ్

image

కేసు డీల్ చేస్తానని లంచం తీసుకున్న కానిస్టేబుల్ వినోద్ రెడ్డిపై SP గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సస్పెన్షన్ వేటు వేశారు. బిజినపల్లి(M) గంగారం గ్రామానికి చెందిన సురేష్ ప్రేమ వివాహం చేసుకొని స్వగ్రామానికి రాగా యువతి కుటుంబీకులు అతడిపై దాడిచేసి యువతిని తీసుకువెళ్లారు. సురేష్ 100కు ఫోన్ చేయగా వినోద్ రెడ్డి గ్రామానికి వెళ్లి మీ కేస్ డీల్ చేస్తానని రూ.2 వేలు తీసుకున్నాడు. దీంతో వినోద్ రెడ్డిని సస్పెండ్ చేశారు.

News September 29, 2024

జోగులాంబదేవికి ఏపీ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు

image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అక్టోబర్ 9వ తేదీన కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాష జోగులాంబ దేవికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ ఇఓ పురేందర్ కుమార్ తెలిపారు. చాలాకాలంగా ఏపీ ప్రభుత్వం తరఫున జోగులాంబ అమ్మవారికి దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని స్పష్టం చేశారు.

News September 29, 2024

MBNR: గణనాథుడి లడ్డూ కైవసం చేసుకున్న ముస్లిం సోదరుడు

image

అచ్చంపేట మండలం నడింపల్లిలో గణనాథుడి లడ్డూను ముస్లిం సోదరుడైన ఎండీ. మోదీన్ కైవసం చేసుకున్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. 21 రోజుల పాటు పూజలందుకున్న వినాయక లడ్డూను శనివారం రాత్రి నిర్వహించిన వేలం పాటలో రూ.40,116కు మోదీన్ సొంతం చేసుకున్నాడని తెలిపారు. అతని కుటుంబానికి ఆ గణనాథుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటాయని, వినాయకుడి కృపతో అష్ట ఐశ్వర్యాలు, సుఖఃసంతోషాలు కలగాలని కమిటీ తరఫున కోరుకోవడం జరిగిందన్నారు.