News January 4, 2025
నవోదయ ప్రవేశానికి 18న ఎంపిక పరీక్ష
మదనపల్లె మండలంలోని వలసపల్లె నవోదయలో 2025-26 విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక పరీక్ష ఈ నెల18న జరుగుతుందని నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. https://navodaya.gov.in/ https://cbseitms.rcil.gov.in/nvs/2 హాల్ టికెట్లు / అడ్మిట్ కార్డ్స్ డౌన్ లోడ్ చేసుకొన వచ్చునని తెలిపారు. వివరాలకు హెల్ప్ డెస్క్ 8919956395 ఫోన్ చేయాలన్నారు. లేకపోతే డైరెక్ట్ గా అయినా సంప్రదించాలన్నారు.
Similar News
News January 8, 2025
పెద్దిరెడ్డికి ఆయుధాలు ఇచ్చేయండి: హైకోర్టు
ఎన్నికల ముందు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి నుంచి పోలీసులు లైసెన్స్‌డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తిరిగి ఇవ్వకపోవడంతో పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నిన్న విచారణ జరిగింది. 2 వారాల్లోనే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు ఆయుధాలు అప్పగించాలని జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఆదేశించారు.
News January 7, 2025
ఢిల్లీలో శాంతిపురం యువకుడి దారుణ హత్య
ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ యువకుడి నిండు ప్రాణం తీసింది. చిత్తూరు జిల్లా శాంతిపురం(M) వెంకటేల్లికి చెందిన హరి కుమారుడు సునీల్ దిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో సునీల్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.4 లక్షలు అప్పులు చేశాడు. 3 రోజుల కిందట కుటుంబసభ్యులు అతడికి రూ.2 లక్షలు పంపించారు. మిగిలిన రూ.2లక్షలు ఇవ్వలేదని యువకుడిని సోమవారం బెట్టింగ్ గ్యాంగ్ హత్య చేశారని మంగళవారం కుటుంబసభ్యులు ఆరోపించారు.
News January 7, 2025
చిత్తూరు ప్రజలు భయపడకండి: డాక్టర్లు
చిత్తూరు జిల్లాకు పక్కనే ఉన్న బెంగళూరులో HMPV కేసు నమోదైంది. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి జిల్లాకు రానున్నారు. దీంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తిరుపతి రుయా డాక్టర్ రవిప్రభు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే సరిపోతుందని తిరుపతి DMHO బాలకృష్ణ నాయక్ స్పష్టం చేశారు.