News March 28, 2025
నవ భారత నిర్మాణం యువత ద్వారానే సాధ్యం: కరీముద్దీన్

నవ భారత నిర్మాణం యువత ద్వారానే సాధ్యమని అబ్దుల్ కలాం ఆజాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్కే కరీముద్దీన్ అన్నారు. సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నైతిక సామాజిక విలువలు పెంపొందించేందుకు ఎన్ఎస్ఎస్ దోహదపడుతుందని చెప్పారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ రత్న ప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు.
Similar News
News November 21, 2025
వనపర్తి: ‘స్నేహపూర్వక పోలీసింగ్’తో ఎస్పీకి ప్రత్యేక ముద్ర.!

వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సేవలు చిరస్మరణీయమని చెప్పవచ్చు. ఆయనను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వనపర్తి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, పోలీసు విభాగానికి కొత్త దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ‘స్నేహపూర్వక పోలీసింగ్’ విధానంతో ప్రజల నుంచి నేర సమాచారం సేకరించడంలో ప్రత్యేక చొరవ చూపారు.
News November 21, 2025
ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM చంద్రబాబు

AP: రాష్ట్రంలో అందరికీ గృహాలు అందించేందుకు భారీ ప్రణాళికను రూపొందిస్తున్నామని CM చంద్రబాబు అన్నారు. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించాలన్నారు. మూడేళ్లలో 17 లక్షల ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. అర్హులను గుర్తించేందుకు సర్వేను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వచ్చేలా కేంద్రంతో చర్చించాలని సూచించారు.
News November 21, 2025
PHOTO: ఫిట్నెస్ ఫ్రీక్గా భారత మహిళా క్రికెటర్

టీమ్ ఇండియా క్రికెట్లో ఫిట్నెస్ అనగానే మేల్ క్రికెటర్స్ గురించే మాట్లాడతారు. వాళ్లు జిమ్ చేసే ఫొటోలు, వీడియోలు వైరలవుతూ ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ చేసిన భారత మహిళా క్రికెటర్ ఫొటో చూశాక చాలామంది అభిప్రాయం మారినట్లు కనిపిస్తోంది. ఆమె మరెవరో కాదు U-19 T20 వరల్డ్ కప్-2025 విన్నింగ్ కెప్టెన్ నికీ ప్రసాద్. ఆమె ఫిట్నెస్ చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.


