News September 21, 2024
నష్టపరిహారం అందని వరద బాధితులకు ప్రత్యేక కౌంటర్లు: కమిషనర్

ఖమ్మం మున్నేరు వరద ముంపునకు గురై నష్ట పరిహారం అందని వరద బాధితుల వివరాల సేకరణ కోసం ప్రతి డివిజన్ నందు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. ఈ ప్రత్యేక కౌంటర్లను రేపటి నుంచి అన్ని డివిజన్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కావున వరద బాధితులు ఈ విషయాన్ని గమనించి తమ వివరాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్లను అధికారులకు అందజేయాలని పేర్కొన్నారు.
Similar News
News October 31, 2025
రక్తదాన శిబిరానికి భారీ స్పందన: సీపీ సునీల్ దత్

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నేలకొండపల్లి మార్కెట్ యార్డులో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించిందని సీపీ సునీల్ దత్ అన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని కొనియాడారు. ఈ శిబిరంలో సుమారు 1500 మంది దాతల నుంచి రక్తం సేకరించినట్లు తెలిపారు. ఖమ్మం రూరల్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
News October 31, 2025
సీఎం సారూ.. ఖమ్మం రండి: ముంపు వాసులు

ఖమ్మంలో మున్నేరు ముంపు వాసులను ఆదుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. 26 అడుగులకు పైగా మున్నేరు ప్రవహించిన నేపథ్యంలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే వరదతో జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ ఈ రోజు వరంగల్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఖమ్మంలో పర్యటించడం లేదు. దీంతో ముంపు వాసులు సీఎం తమ ప్రాంతంలో పర్యటించి తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
News October 31, 2025
నేటి నుంచి విజయ డెయిరీ దుకాణాలకు టెండర్లు

ఖమ్మం నగరంలోని విజయ డెయిరీ ఆవరణలో నిర్మించిన 10 దుకాణ సమూదాయాలను అద్దెకు ఇచ్చేందుకు నవంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు టెండర్లు నిర్వహిస్తున్నట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ కోడిరెక్క రవికుమార్ తెలిపారు. ఒక్కో దుకాణానికి నెలకు రూ.15వేలుగా నిర్ణయించామని, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2 లక్షలు చెల్లించాలన్నారు.


