News April 9, 2025

నష్టపరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్

image

ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం తాండూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో దుద్యాల మండలం హకీంపేట, లగచర్లకు సంబంధించిన స్వంత పట్టా భూములు కలిగిన రైతులకు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తహశీల్దార్ కిషన్లతో కలిసి రైతులకు నష్ట పరిహార చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు.

Similar News

News April 24, 2025

KMR: ఉత్తమ సేవకు గుర్తింపు

image

కామారెడ్డి జయశంకర్ కాలనీ రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళను కాపాడిన బ్లూ కోల్ట్ సిబ్బంది నరసింహులు, వసంత్‌లను జిల్లా SP రాజేశ్ చంద్ర అభినందించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వారి సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ.. నగదు పురస్కారాన్ని అందజేశారు. అలాగే డయల్ 100కు వెంటనే సమాచారం అందించిన కె.దేవ కుమార్‌ను SP మెచ్చుకొని నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.

News April 24, 2025

పాపన్నపేట: ఒంటిపై పెట్రోల్ పోసుకున్న యువకుడు మృతి

image

ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు మృతి చెందాడు. పాపన్నపేట ఏఎస్ఐ సంగన్న కథనం ప్రకారం.. కొడుపాకకు చెందిన అవుసుల శ్రీకాంత్ (24) స్వర్ణకారుడుగా పనిచేస్తున్నాడు. ఈనెల 21న రాత్రి ఇంట్లో భార్య, తల్లికి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెంది శ్రీకాంత్ పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని మృతుడి భార్య లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News April 24, 2025

 నరసరావుపేట: కావ్యశ్రీని దత్తత తీసుకున్న కలెక్టర్

image

పదో తరగతిలో 590 మార్కులు సాధించిన కారంపూడి జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని కావ్యశ్రీని జిల్లా కలెక్టర్ పి. అరుణ్‌బాబు బుధవారం దత్తత తీసుకున్నారు. పేద కుటుంబానికి చెందిన ప్రతిభావంతురాలైన కావ్యశ్రీ ఉన్నత చదువుకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఆమె తల్లిదండ్రులు రామయ్య, కోటేశ్వరమ్మ దంపతులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

error: Content is protected !!