News September 10, 2024
నష్ట నివేదికను 11న అందజేయాలి: కలెక్టర్ దినకర్

శ్రీకాకుళం జిల్లాలో వర్షాల కారణంగా నష్టం వాటిల్లిన వివరాలను 11వ తేదీ నాటికి అందజేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవానం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీ రాజ్, డీపీవో,ఆర్‌డబ్ల్యుఎస్, డ్వామా, గృహ నిర్మాణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలలకు డేమేజ్ జరిగితే తక్షణమే మరమ్మతు పనులు చేయాలన్నారు.
Similar News
News January 5, 2026
టెక్కలి: 10 సార్లు సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తి మృతి

టెక్కలి మండలం పెద్దసానకు చెందిన కోట చిన్నబాబు (103) సోమవారం మృతిచెందారు. గ్రామానికి చెందిన చిన్నబాబు సుమారు 50 ఏళ్లు (10 సార్లు) గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. అంతే కాకుండా ఒక విద్యా సంస్థల ఛైర్మన్‌గా.. రైతు సంఘం నాయకునిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా సోమవారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రముఖులు నివాళులు అర్పించారు.
News January 5, 2026
శ్రీకాకుళం: యాక్టివ్ మోడ్‌లోకి ఆ సీనియర్ నేత..పొలిటికల్ గేమ్‌కేనా!

2024 ఎన్నికలనంతరం రెండేళ్లుగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు మౌనంగా ఉన్నారు. వైసీపీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. కూటమిని విమర్శించ లేదు. అయితే ఇటీవల పలు సమావేశాల్లో పక్కా లెక్కలతో మాట్లాడి యాక్టివ్ మోడ్‌లోకొచ్చారు. ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ధర్మాన ప్రసాద్‌కు ఉంది. ఈ సీనియర్‌తోనే వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి నుంచి పార్టీ బలోపేతానికి వ్యూహం రచిస్తారని అంతర్గత చర్చ సాగుతోంది.
News January 5, 2026
SKLM: పది పాసైతే చాలు 350 ఉద్యోగాలు

ఈనెల 7న కొత్తూరులోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి సాయికుమార్ ఆదివారం తెలిపారు. 10 కంపెనీలకు చెందిన యాజమాన్యాలు 350 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివి 18-30 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.


