News February 10, 2025
నసురుల్లాబాద్: ‘పంటలు ఎండి పోతున్నాయి’

నసురుల్లాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామంలో నిజాంసాగర్ కాలువ నీళ్లు అందక ఎండిపోతున్న వరి పంటను జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలు ఎండిపోతున్న విషయం వాస్తవమేనని పంటలకు నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ADA అరుణ, AO భవాని, AEO గోపాల్, రైతులు పాల్గొన్నారు.
Similar News
News November 24, 2025
హైకమాండ్ కోరుకుంటే సీఎంగా కొనసాగుతా: సిద్దరామయ్య

కాంగ్రెస్ హైకమాండ్ కోరుకుంటే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మార్పులు ఏవైనా కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. వారు ఏం చెప్పినా తాను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంగీకరించాల్సిందేనని తెలిపారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు 4-5 నెలల కిందటే హైకమాండ్ ఒప్పుకుందని, అయితే 2.5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యేదాకా ఆగాలని చెప్పిందని పేర్కొన్నారు.
News November 24, 2025
సిద్దిపేట: అకాల వర్షాలు.. అలర్ట్గా ఉండండి: కలెక్టర్

జిల్లాలో రాబోయే నాలుగు రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అధికారులందరూ అలెర్ట్గా ఉండాలని కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి అన్ని శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు. వర్షాల నుంచి ధాన్యం తడవకుండా రైతులకు వెంటనే టార్పాలిన్ కవర్లు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
News November 24, 2025
భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది: ప్రధాని మోదీ

ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నటనతో అనేక పాత్రలకు ఆయన ప్రాణం పోశారని కొనియాడారు. ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు. ధర్మేంద్ర మృతికి బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, తదితరులు సంతాపం తెలిపారు.


