News February 23, 2025

నస్తూర్ పల్లి అడవుల్లో పెద్దపులి సంచారం.. బస్సుల్లో ప్రయాణం!

image

కాటారం మండలంలోని నస్తూర్ పల్లి గ్రామ సమీప అడవుల్లో పెద్దపులి సంచరించిందనే వార్త వ్యాప్తి చెందింది. దీంతో మండలంలోని అటవీ సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. కాటారం నుంచి కాళేశ్వరం తదితర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు బైకులను పక్కనపెట్టి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. పులి మహాదేవపూర్ మండలంలోని బొమ్మపూర్ వైపు ప్రయాణించిందని చర్చ జోరుగా నడుస్తోంది. కాగా, దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Similar News

News September 17, 2025

ఆదిలాబాద్: పోలీస్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం

image

ఆదిలాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ​అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు.

News September 17, 2025

రాజానగరం: డా.రెడ్డీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను పరిశీలించిన వీసీ

image

నన్నయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విద్యార్థులకు నిర్వహించిన డా.రెడ్డీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ పరిశీలించారు. యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆచార్య బి. జగన్మోహన్ రెడ్డి, సంస్థ హెచ్.ఆర్ లక్ష్మీదుర్గలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విశ్వవిద్యాలయం తరఫున ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని వీసీ కోరారు.

News September 17, 2025

MBNR: బిచ్చగాడిని హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

image

దేవరకద్ర బస్ స్టాండ్ సమీపంలో బిచ్చగాడిని రాళ్లతో కొట్టి హత్య చేసిన కేసులో మహబూబ్‌నగర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు వెంకటేష్‌కు న్యాయమూర్తి వి.శారదా దేవి జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. ఈ కేసు విచారణలో శ్రమించిన సీఐ రామకృష్ణ, డీఎస్పీ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.