News January 27, 2025
నస్పూర్: క్షుద్ర పూజల కేసులో నిందితులు వీళ్లే..!

క్షుద్రపూజలు చేసి కోట్లలో డబ్బుల వర్షం కురిపిస్తానని మాయమాటలు చెప్పి మంచిర్యాలకు చెందిన మాదంశెట్టి ప్రభంజన్ వద్ద రూ.2 లక్షలు వసూలు చేసిన ముఠాలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు సీసీసీ నస్పూర్ ఎస్సై సుగుణాకర్ తెలిపారు. నిందితులు శీతల్ దత్తాత్రేయ కొరవి జాదవ్ @ శివచరణ్ జాదవ్, దెబ్బటి కిషన్, ఐత సత్యనారాయణ @సతీష్, ఎరిసి ప్రశాంతిలను అరెస్ట్ చేశామన్నారు. దంతెల ప్రభాకర్, రంజిత్, బాలకృష్ణ పరారీలో ఉన్నారన్నారు.
Similar News
News December 4, 2025
తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది: జగన్

AP: TDP ఆధిపత్యపోరులో జరిగిన హత్య ఘటనలో పిన్నెల్లి సోదరులను అరెస్టు చేశారని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. హతులు, హంతకులు TDP వాళ్లేనని స్వయంగా SPయే చెప్పారన్నారు. ఇవే కాకుండా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ‘ఎక్కడైనా న్యాయం ఉందా? తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది’ అని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్పై CBN గతంలో ఒకలా మాట్లాడి ఇపుడు కార్మికుల్ని బెదిరిస్తున్నారని విమర్శించారు.
News December 4, 2025
పనిచేయని పోలీస్ వెబ్ సైట్లు.. ప్రజలకు ఇబ్బందులు

TG: సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్సైట్లు పనిచేయకపోవడంతో ఆన్లైన్ ఫిర్యాదుల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ తర్వాత కేటుగాళ్లు పోలీస్ సైట్లలో లింకులు ఓపెన్ చేస్తే బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ అయ్యేలా చేశారు. దీంతో ముందు జాగ్రత్తగా ఐటీ విభాగం సర్వర్లను తాత్కాలికంగా డౌన్ చేసింది. అంతకుముందు మంత్రుల వాట్సాప్ గ్రూపులు కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.
News December 4, 2025
దుగ్గిరాలలో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్ పసుపు రూ.12,500 గరిష్ఠ ధర పలికింది. యార్డులో గురువారం నిర్వహించిన వేలంలో పసుపు కొమ్ముల ధర రూ.8,500 నుంచి రూ.12,500 పలకగా కాయ రకం పసుపు ధర రూ. 8,550 నుంచి రూ.12,500 వరకు పలికినట్లు అధికారులు తెలిపారు. రైతులు యార్డుకు తెచ్చిన పసుపు పంటలో 684 బస్తాలను వ్యాపారులకు విక్రయించారు.


