News April 15, 2025

నస్పూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

నస్పూర్ మండలం దొరగారి పల్లె సమీపంలో గుర్తు తెలియని వాహనం వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వయస్సు సుమారుగా 50 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. నలుపు రంగు టీ షర్టు, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. ఇతని ఆచూకీ తెలిపిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు.

Similar News

News December 2, 2025

తిరుపతి: కోనలో ఇరుక్కుపోయిన భక్తులు

image

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని బత్తినయ్య కోనకు వెళ్లిన కొందరు భక్తులు చిక్కుకుపోయారు. బత్తినయ్య కోనలోని భక్తకంటేశ్వర స్వామి దర్శనానికి సోమవారం భక్తులు వెళ్లారు. ఇవాళ ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. భారీ వర్షాలతో కోనకు సమీపంలోని వాగుకు వరద పోటెత్తింది. అటవీ ప్రాంతం నుంచి వేరే దారి ఉన్నప్పటికీ స్థానికేతరులు కావడంతో చిక్కుకుపోయారు. ట్రాక్టర్, రోప్ తీసుకుని ఏర్పేడు అధికారులు ఘటన స్థలానికి బయల్దేరారు.

News December 2, 2025

ఏయూలో స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు నోటిఫికేషన్

image

ఏయూలో స్పెష‌ల్ డ్రైవ్ ప‌రీక్ష‌ల‌కు కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ అధికారి టి.చిట్టిబాబు నోటిఫికేష‌న్‌‌ విడుద‌ల చేశారు. 2010-11 సంవ‌త్స‌రం నుంచి 2025 వ‌ర‌కు డిగ్రీ, పీజీ ప్ర‌వేశం పొందిన విద్యార్థులు స్పెష‌ల్ డ్రైవ్ ప‌రీక్ష‌ల‌కు అర్హులుగా ఆయన పేర్కొన్నారు. డిసెంబ‌ర్ 4 నుంచి 26వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఫిబ్ర‌వ‌రి 20వ తేదీ నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారు.

News December 2, 2025

భూపాలపల్లి: కాంగ్రెస్ సారథికి సవాల్!

image

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్‌కు పంచాయతీ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత లుకలుకల నేపథ్యంలో, అన్ని వర్గాలను కలుపుకుపోవడం ఆయనకు కత్తిమీద సాములా మారింది. సీనియర్ నాయకులతో సమన్వయం సాధించడంపైనే ఆయన దృష్టి సారించాల్సి ఉంటుంది.