News March 18, 2025
నస్పూర్: ‘10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

జిల్లాలో ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్‌లోని మంచిర్యాల కలక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 9,189 మంది రెగ్యులర్, 221 మంది ఒక్కసారి అనుత్తీర్ణులైన విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు.
Similar News
News December 13, 2025
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగకి నెలకొనే రద్దీ దృష్ట్యా జనవరి 8వ తేదీ నుంచే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా APలోని ఇతర ప్రాంతాలు, పక్క రాష్ట్రాలకు ఈ రైళ్లు నడవనున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. స్పెషల్ ట్రైన్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ <
News December 13, 2025
బుట్టాయగూడెం: గురుకుల పాఠశాలలో తనిఖీలు

ఏపీ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం. నాయక్ శనివారం బూసరాజుపల్లి గిరిజన గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని వసతులు, విద్యాబోధన తీరును పరిశీలించిన ఆయన, అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యత, రుచి ఎలా ఉంటుందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
News December 13, 2025
చుంచుపల్లి: మున్సిపాలిటీ-పంచాయతీని వేరు చేస్తున్న హైవే

చుంచుపల్లి మండలం ప్రశాంతినగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ నెలకొన్న భౌగోళిక పరిస్థితి అభ్యర్థులను అయోమయానికి గురిచేస్తోంది. హైవే మున్సిపాలిటీని, పంచాయతీని వేరు చేస్తోంది.
ప్రశాంతినగర్, కొత్తగూడెం మున్సిపాలిటీలను హైవే విభజిస్తోంది. హైవేకి తూర్పున ఉన్న ప్రాంతం పంచాయతీ పరిధిలోకి రాగా, పడమర ప్రాంతం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. ఈ పంచాయతీలో 1633 మంది ఓటర్లు ఉన్నారు.


