News April 7, 2025
నస్రుల్లాబాద్: కల్తీ కల్లు తాగి పలువురికి తీవ్ర అస్వస్థత

నస్రుల్లాబాద్ మండలంలో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ మండలం అంకోల్, దుర్కి, అంకోల్ తండా తదితర గ్రామాల్లో సోమవారం కల్తీ కల్లు తాగిన పలువురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్లు తాగి అస్వస్థతకు గురైన వారు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News November 14, 2025
పాఠశాలల్లో డ్రాపౌట్లు ఉండకూడదు: కలెక్టర్ సిరి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు డ్రాపౌట్లు కాకుండా చూడాలని, పిల్లలను వలసలకు తీసుకెళ్లే తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విద్యా శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో డీఈఓ, ఎంఈఓలతో నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ ప్రాంతంలో ఈ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు.
News November 14, 2025
కాంగ్రెస్‌కు కొత్త నిర్వచనం చెప్పిన PM మోదీ

ఇప్పుడున్న కాంగ్రెస్ MMCగా మారిందని బిహార్ విక్టరీ సెలబ్రేషన్స్‌లో ప్రధాని మోదీ విమర్శించారు. ‘MMC అంటే ముస్లింలీగ్ మావోవాది కాంగ్రెస్. ఇతర పార్టీల ఓట్లతో బతకాలని కాంగ్రెస్ చూస్తోంది. ఎన్నికలు వస్తే వేరే పార్టీలనూ ముంచేస్తోంది. ప్రజలకు ఆ పార్టీపై క్రమంగా విశ్వాసం పోతోంది’ అని వ్యాఖ్యానించారు. ఇక బిహార్‌లో ఆర్జేడీ MY(ముస్లిం, యాదవ్) ఫార్ములాను నమ్మితే తాము MY(మహిళా, యూత్)ను నమ్మినట్లు చెప్పారు.
News November 14, 2025
ప్రకాశం: వచ్చేనెల ఒకటి నుంచి సీజనల్ హాస్టళ్లు ప్రారంభం.!

ప్రకాశం జిల్లాలో వలసదారుల పిల్లల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి సీజనల్ హాస్టల్‌లను వచ్చేనెల 1 నుంచి ప్రారంభించనున్నట్లు DEO కిరణ్‌కుమార్ వెల్లడించారు. సీఎస్‌పురం మండలం పెదరాజుపాలెం, గుంతచెన్నంపల్లి, చీమకుర్తి మండలం పినాయుడుపాలెం, గిద్దలూరు మండలం త్రిపురవరం, కొంగలవీడు, తర్లుపాడు నాజెండ్లముడుపులలో హాస్టల్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి నిర్వహణకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


