News March 24, 2025

నస్రుల్లాబాద్: చెరువులో పడి వ్యక్తి మృతి

image

చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం నస్రుల్లాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన కీసరి రాములు(37) ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Similar News

News March 29, 2025

HYD: ఉరేసుకొని మెహందీ ఆర్టిస్ట్ మృతి

image

రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

News March 29, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు వరుసగా నాలుగవ రోజూ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 పెరిగి రూ.83,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 పెరగడంతో రూ.91,200 వద్ద కొనసాగుతోంది. అటు వెండి మాత్రం రూ.1000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,13,000గా ఉంది.

News March 29, 2025

ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే: కర్నూలు ఎంపీ

image

తన లాంటి సామాన్యుడిని ఎంపీని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. శనివారం కర్నూలులో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఊపిరి ఉన్నంత వరకు తాను టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. టీడీపీ పేదల పార్టీ అని తెలిపారు.

error: Content is protected !!