News July 11, 2024

నస్రుల్లాబాద్: పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ

image

పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసిన ఘటన నస్రుల్లాబాద్ మం.లో జరిగింది. పోలీసుల ప్రకారం.. శ్రీను, శ్రీకాంత్ అనే ఇద్దరు తమ తండ్రుల పేరిట ఉన్న ఇళ్లకు నకిలీ స్టాంపులు, పత్రాలు, రశీదులు, పంచాయతీ ధ్రువపత్రాలు తయారుచేశారు. అంతేగాక పంచాయతీ కార్యదర్శి రజిత సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఓ ఫైనాన్స్‌లో ఇద్దరు రుణాలు తీసుకొని చెల్లించకపోవటంతో సిబ్బంది ఆరా తీయగా విషయం బయటపడింది.

Similar News

News February 19, 2025

నిజామాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

➔NZB: పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
➔నిజామాబాద్: ‘నన్ను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తా’
➔నిజామాబాద్: పోలీస్ వాహనం అద్దాలు ధ్వంసం.. ఐదుగురికి రిమాండ్
➔నిజామాబాద్: ఇద్దరి హత్య కేసులో సంచలన తీర్పు: ప్రాసిక్యూటర్ రాజేశ్వర్
➔నిజామాబాద్: పోలింగ్ కేంద్రం వివరాలతో అభ్యర్థుల SMS ప్రచారం

News February 19, 2025

నిజామాబాద్: పోలీస్ వాహనం అద్దాలు ధ్వంసం.. ఐదుగురికి రిమాండ్

image

పోలీసు వాహనం అద్దాలు ధ్వంసం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించినట్లు నిజామాబాద్ 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్‌లో ఈనెల 15న కొందరు వ్యక్తులు దాడి చేస్తున్నారనే సమాచారం మేరకు పెట్రో కారులో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లగా కొంత మంది వ్యక్తులు కారు అద్దాలు పగలగొట్టారు. దీనిపై కేసు నమోదు చేసి ఐదుగురిని కోర్టులో హాజరుపరిచామని ఎస్ఐ వివరించారు.

News February 19, 2025

కామారెడ్డి: ఊరికి వెళుతూ చనిపోయాడు..!

image

కామారెడ్డి జిల్లా భిక్కనూరు వాసి మంగళి కొత్తపల్లి అఖిల్(26) <<15506966>>రోడ్డు ప్రమాదంలో<<>> చనిపోయిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మంగళవారం పల్సర్ బైక్‌‌‌పై అఖిల్ కామారెడ్డి నుంచి ఊరికి బయల్దేరాడు. అంతంపల్లి శివారులోని చైతన్యనగర్ కాలనీ వద్ద 44వ జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డు కిందకి వేగంగా దూసుకెళ్లి చెట్టుకు ఢీకొట్టి చనిపోయాడు. మృతుడికి భార్య, ఏడాది వయసు గల కూతురు ఉన్నారు.

error: Content is protected !!